తిరుమలలోని ఓ మఠంలో రహస్యంగా రెండోపెళ్లికి సిద్దమైన రాకేశ్ అనే వ్యక్తిని మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించడం సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా పెద్దపెండ్యాలకు చెందిన సంధ్యను రాకేశ్ 9 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది. వారి మధ్య విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టులో కేసు వేసుకున్నారు. కేసు తేలకముందే రాకేశ్ తిరుమలలోని ఓ మఠంలో రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. సమాచారం అందుకున్న మొదటి భార్య సంధ్య బంధువులతో సహా అక్కడికి చేరుకుంది. రెండో వివాహం కొన్ని క్షణాల్లో ప్రారంభం అవుతుందనగా సంధ్య, ఆమె బంధువులు రాకేశ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టులో విడాకుల కేసు తేలకముందే మరో పెళ్లి చేసుకుంటున్నాడనే పక్కా సమాచారంతో తిరుమలకు చేరుకున్నట్లు రాకేశ్ మొదటి భార్య సంధ్య తెలిపింది.