కృష్ణాలో వరద కొనసాగుతోంది. రెండేళ్ల తరవాత ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరచుకున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేసి 2 లక్షల 86వేల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదులుతున్నారు. కాలువలకు 13600 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
ఆల్మట్టి నుంచి జూరాలకు వస్తోన్న వరద క్రమంగా తగ్గుతోంది. తాజాగా ఆల్మట్టి నుంచి
2 లక్షల 3 వేల క్యూసెక్కుల వరద జూరాల చేరుతోంది. తుంగభద్ర నుంచి 53 వేల క్యూసెక్కులు వస్తోంది. మొత్తంమీద శ్రీశైలం ప్రాజెక్టులకు 3.95 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇప్పటికే డ్యాం మొత్తం నిండిపోవడంతో వరదను నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 304 టీఎంసీల జలాలు చేరాయి. మొత్తం సామర్థ్యం 312 టీఎంసీలు. ఎగువ నుంచి 3.95 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. కుడి ఎడమ కాలువలకు 16 వేల క్యూసెక్కులు, మాధవరెడ్డి ఎత్తిపోతలకు 1850 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 32 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.వరద మరో వారంపాటు కొనసాగే అవకాశముందని ఇంజనీర్లు చెబుతున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు