పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మొట్టమొదటి రజత పతకం సాధించిపెట్టాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. గొప్ప ఆటతీరు కనబరిచి, మేటి ఆటగాళ్ళను అధిగమించాడు. పురుషుల జావెలెన్ త్రో విభాగంలో 89.45 మీటర్ల దూరం విసిరి, వెండి పతకం గెలుచుకున్నాడు. అనూహ్యంగా అద్భుతంగా ఆడిన పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్, స్వర్ణ పతకం సాధించడం కొసమెరుపు.
టోక్యో ఒలింపిక్స్లో పురుషుల జావెలెన్ త్రో ఈవెంట్లో స్వర్ణపతకం సాధించి రికార్డు సృష్టించిన నీరజ్ చోప్రా ఈసారి కూడా గొప్ప ప్రదర్శన చేసాడు. మొదటి ప్రయత్నంలో ఫౌల్ చేసినప్పటికీ రెండో ప్రయత్నంలో తన రెండో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసాడు. 89.45 మీటర్ల దూరం జావెలెన్ను విసిరాడు. ఈ పోటీలో తనకు ప్రధాన పోటీ అనుకున్న క్రీడాకారులు అందరికంటె ఎక్కువ దూరమే బల్లేన్ని విసరగలిగాడు. అయితే పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ తన రెండో ప్రయత్నంలో జావెలెన్ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఒలింపిక్స్లో సైతం కొత్త రికార్డు సృష్టించాడు.