అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 808 పాయింట్ల లాభంతో 79695 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 245 పెరిగి, 24362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అమెరికాలో నిరుద్యోగుల క్లెయిమ్‌లు అంచనాల కంటే భారీగా తగ్గడం మార్కెట్లకు కలసివచ్చింది. గురువారంనాడు అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో అన్నీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటాస్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, మారుతి, భారతి ఎయిల్‌టెల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.85గా ఉంది. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. తాగాజా బ్యారెల్ క్యూడాయిల్ 79.26 వద్ద కొనసాగుతోంది. ఔన్సు గోల్డ్ 2435 అమెరికా డాలర్ల వద్ద ఉంది.