గత ఏడాది అక్టోబర్ 27న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేటికీ ముగియలేదు. పలుదేశాలు చేస్తోన్న కాల్పుల విరమణ ప్రక్రియ కూడా ఫలించలేదు. తాజాగా మరోసారి అమెరికా, ఈజిప్టు, ఖతర్ దేశాలు షరతులు లేకుండా కాల్పుల విరమణకు రావాలని రెండు వర్గాలను ఆహ్వానించాయి.కాల్పుల విమరణ, బందీల విడుదల తప్ప వేరే అంశాలు లేకుండా చర్చలకు వచ్చేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే అంగీకరించింది. ఆగష్టు 15న చర్చలు జరిగే అవకాశముంది.
కాల్పుల విరమణ చర్చల విషయంలో ఉగ్రవాద సంస్థ హమాస్ ఇంకా స్పందించలేదు.
హమాస్ కీలక నేతలను కోల్పోయిన ఉగ్రసంస్థ ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై కుదిరినప్పుడల్లా దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ కూడా యుద్ధంలోకి దిగబోతోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో అమెరికా కూడా యుద్ధనౌకలను మోహరించింది.
హమాస్, హెజ్బొల్లా ఉగ్రనేతలు హతమైన తరవాత పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇది ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దంగా రూపాంతరం చెందుతుందని అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసేందుకు మూడు దేశాలు కీలకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు