పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ మరో పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్పెయిన్‌పై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది.
పురుషుల హాకీ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ కోసం భారత జట్టు స్పానిష్ ఆటగాళ్ళతో పోటీ పడింది. కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన గోల్‌కీపర్ శ్రీజేష్ గొప్ప ప్రతిభ ప్రదర్శించాడు. సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయిన భారత్, మూడో స్థానం కోసం జరిగిన పోరులో తన ప్రతాపం చూపింది. స్పెయిన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌ను భారత్ అటాకింగ్ ధోరణిలో మొదలుపెట్టినా, మొదటి గోల్ స్పెయిన్ జట్టే చేయగలిగింది. భారత ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న మిరాల్స్ మార్క్, ఆట 18వ నిమిషంలో తమ జట్టుకు గోల్ సాధించాడు.
తర్వాత భారత్ కొద్దిగా ఆత్మరక్షణ వైఖరి అవలంబించినా, బ్రేక్‌కి ముందు మన్‌ప్రీత్‌సింగ్ పెనాల్టీ కార్నర్ రాబట్టాడు. దాన్ని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచాడు. అక్కడికి ఇరుజట్ల స్కోర్ సమమైంది. మూడో క్వార్టర్లో హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. తర్వాత భారత్‌ను స్పెయిన్ నియంత్రించగలిగినా, మరో గోల్ మాత్రం చేయలేకపోయింది. శ్రీజేష్ అద్భుతమైన కీపింగ్ చేసి, స్పానిష్ ఆటగాళ్ళను కట్టిపడేసాడు. ఫలితంగా భారత్ విజయంతో పాటు కాంస్యపతకం దక్కించుకుంది.
2004లో నేషనల్ జూనియర్స్ హాకీ టీమ్‌లో అడుగుపెట్టిన శ్రీజేష్ రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలో శ్రీజేష్ కీలక భూమిక వహించాడు. ఇప్పుడు ఈ ఒలింపిక్స్‌లోనూ మరో కాంస్యం సాధించిపెట్టి, తన కెరీర్‌ను ఘనంగా ముగించాడు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు