దేశీయ స్టాక్ సూచీలు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. నిన్న లాభాలు ఆర్జించినా ఇవాళ మరలా నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రారంభం నుంచి భారీ నష్టాల్లో ట్రేడైన సెన్సెక్స్ చివరకు 596 పాయింట్ల నష్టంతో 78872
వద్ద ముగిసింది. నిఫ్టీ 180 నష్టంతో 24117 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సీ లాభాలు ఆర్జించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, మారుతీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ క్రూడాయిల్ 77.89 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ యూఎస్ డాలరుకు 83.80 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2437 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.