ప్రముఖ రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై భారత ఒలింపిక్స్ అసోషియేషన్ మూడేళ్ల నిషేధం విధించింది. క్రీడా గ్రామంలో తన వస్తువులు ఉన్నాయంటూ తన అక్రిడేషన్ ఇచ్చి, ఆమె చెల్లిని తీసుకురావాలని పంపించింది. వస్తువులు తీసుకుని వెనక్కు వచ్చే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అనేక ప్రశ్నలు వేసి వదిలేశారు. అంతిమ్ పంఘాల్ను పిలిపించి వివరణ తీసుకున్నారు.
ఇవన్నీ గమనించిన భారత ఒలింపిక్స్ అసోషియేషన్ పంఘాల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అక్రిడేషన్ దుర్వినియోగం కింద మూడేళ్లు నిషేధం విధించింది.