వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదంలో కూరుకుపోయిన వయనాడ్ లో ప్రధాని మోదీ ఆగస్టు 10న పర్యటించనున్నారు. సహాయ శిబిరాలకు వెళ్ళి బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా జరిగిన నష్టాన్ని తెలుసుకోనున్నారు. అనంతరం సహాయ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆగస్టు 10న 12 గంటలకు సందర్శిస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు దిల్లీకి బయలుదేరుతారు.
వయనాడ్ విపత్తు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న కేరళ కేబినెట్ సబ్ కమిటీ, జిల్లా యంత్రాంగం ప్రధాని మోదీకి స్వాగతం పలకనుంది. ఈ రోజు అడ్వాన్స్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందం వయనాడ్‌లో పర్యటించి మోడీ హెలికాప్టర్ కోసం సేఫ్ ల్యాండింగ్ జోన్‌ను పరిశీలించింది.