భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. స్వల్ప వ్యవధిలో జపాన్లోని మియాజకీ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 7.1, 6.9గా నమోదైంది. భూకంప కేంద్రం హుగనాడా సముద్రంలో 8.8 కి.మీ లోతులో ఉందని గుర్తించారు. భూకంప తీవ్రతకు సునామీ వచ్చే ప్రమాదముందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్ర అలలు మీటరుపైగా ఎగసి పడుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రాణ, ఆస్తినష్టం వివరాలు అందాల్సి ఉంది. ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు. భూకంప తీవ్రతకు కిరీషిమా, కనోయా పట్టణాలు తీవ్రంగా కంపించాయి.