రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను ప్రకటించింది. వరుసగా తొమ్మిదవసారి రెపోరేటు 6.5 శాతం నిర్ణయించి యథాతథంగా కొనసాగించింది. ద్రల్యోల్భణం స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రుతుపవనాలు ఆశించిన విధంగా వర్షాలు తీసుకురావడంతో రాబోయే రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2గా నమోదు కావచ్చని అంచనా వేశారు.
విదేశీ మారక నిల్వలు 675 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పరిమిత శ్రేణిలో కదలాడుతోంది. రెండేళ్ల కిందట కరెంటు ఖాతా లోటు 2 శాతం ఉండగా నేడు అది 0.7 శాతానికి దిగి రావడం ఆశాజనకంగా ఉంది. స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లు, అమెరికాలో ఆర్థికమాంద్యం భయాలు భారత ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్నాయి.