గత రెండు వారాలుగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసింది. రిజర్వేషన్ల వ్యవహారం ఇరువర్గాల మధ్య తీవ్ర హింసకు దారితీయడంతో ఇప్పటి వరకు 440 మంది పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొందరు భారత్‌లోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గుడి జిల్లా దక్షిణ్ బెరూబారీ గ్రామ సరిహద్దు ఔట్‌పోస్టు వద్దకు వేలాది మంది బంగ్లాదేశీయలు చేరుకున్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. భారత్‌లో ఆశ్రయం కల్పించాలని వేడుకుంటున్నారని, వారిని వెనక్కు పంపినట్లు చెప్పారు.బంగ్లాదేశ్ సరిహద్దు వెంట 4196 కి.మీ మేర భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పిడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని విదేశాంగశాఖ తెలిపింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు