కర్ణాటకలో దారుణం జరిగింది. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో లిఖితశ్రీ నవీన్‌లకు బుధవారం పెద్దలు వివాహం జరిపించారు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తున్నారు. నవదంపతులు ఇంకా పెళ్లి దుస్తులు కూడా మార్చుకోలేదు. మండపంలో దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్లిన నవదంపతులు దారుణంగా కొట్టుకున్నారు. అతి కష్టంమీద వరుడు నవీన్ తలుపుతీసుకుని రక్తగాయాలతో బయటకు వచ్చాడు. గమనించిన పెద్దలు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లిఖితశ్రీ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. నవీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
వీరి గొడవకు కారణం తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నవదంపతుల గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.