శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ కోల్పోయింది. ఇరుజట్ల మధ్య బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య శ్రీలంక ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. కేవలం 26.1 ఓవర్లలో 138 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ( 35), కోహ్లీ( 20) పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ (30 ) మాత్రమే ఫరవాలేదు అనిపించారు. శుభ్ మాన్ గిల్ (6), రిషబ్ పంత్ (6), శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ 2, రియాన్ పరాగ్ (15), శివమ్ దూబే (9) తీవ్రంగా నిరాశపరిచారు. మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే చెరో రెండు వికెట్లు తీయగా , అసిత ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.
శ్రీలంక జట్టు ద్వైపాక్షిక వన్డే సిరీస్ ల్లో భారత్ పై గెలవడం 27 ఏళ్ళ తర్వాత ఇదే ప్రథమం. చివరిసారిగా 1997లో శ్రీలంక జట్టు భారత్ పై ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో విజయం సాధించింది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల