వరదలతో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తినష్టంతో అల్లాడుతున్న వయనాడ్ నివాసితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. బాధితులకు తక్షణసాయం అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళంగా అందజేస్తున్నట్లు హీరో ప్రభాస్ తెలిపారు. జులై 30న కురిసిన కుంభవృష్ఠితో వయనాడ్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. .
వయనాడ్ లో సహాయ చర్యల కోసం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి రూపాయలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు చిరంజీవి ఎక్స్ వేదికగా తెలిపారు. అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించాడు.
కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ కూడా విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.