పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కూటమితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరతానన్న విషయం త్వరలో చెబుతానని దొరబాబు అన్నారు. పిఠాపురంలోని తన నివాసం దగ్గర ఆయన ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు.
పెండెం దొరబాబు 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో అదే పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అప్పట్లోనే దొరబాబు వైసీపీని విడిచిపెట్టాలని భావించారు. జగన్ బుజ్జగించడంతో ఆగిపోయారు. కానీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. 2024 ఎన్నికల్లో ఆయన అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు.
గత ఎన్నికల్లో దొరబాబు వర్గం మొత్తం పవన్‌కళ్యాణ్‌కు అనుకూలంగా పనిచేసిందని, అందువల్లే పవన్‌కళ్యాణ్‌కు భారీ మెజారిటీ లభించిందనీ స్థానికుల కథనం. అందువల్లే, దొరబాబు ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే గుంటూరు పశ్చిమం మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీని విడిచిపెట్టారు. ఇప్పుడు పెండెం దొరబాబు కూడా వారి బాటే పట్టారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు