సురక్షితంగా బయటపడిన కుటుంబం
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అదుపుతప్పాయి. ఆందోళనకారులు చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మక మారి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి.
వివిధ రంగాల్లో ప్రముఖుల నివాసాలను దోచుకోవడం, నిప్పు పెడుతున్నారు. ఢాకాలో హిందూ సంగీతకారుడు, గీత రచయిత, గాయకుడు రాహుల్ ఆనంద నివాసానికి నిప్పుపెట్టారు. దాడి నుంచి ఆనంద, అతని భార్య, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇంటికి నిప్పు పెట్టడానికి ముందు మూడు వేల రకాల సంగీత వాయిద్యాలను తగలబెట్టేశారు. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. రాహుల్ ఆనంద ఢాకాలో జోలెర్ గాన్ అనే ప్రసిద్ధ జానపద బృందాన్ని నిర్వహిస్తున్నాడు.