జమ్ముకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య బుల్లెట్ ఫైట్ జరిగింది. ప్రతికూల వాతావరణానికి తోడు పొగమంచు మధ్య భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అడవుల్లో నక్కిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రతీ అడుగును జల్లడ పడుతున్నాయి.
ఖనేడ్ అడవిలో ఉగ్రవాదులకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. నలుగురు ఉగ్రవాదులతో కూడిన జైషే గ్రూపు రెండు వర్గాలగా విడిపోయింది. ఒక గ్రూపు పొదల్లో నక్కగా మరొక గ్రూపు తప్పించుకుందని డీఐజీ మహ్మద్ రైస్ భట్ తెలిపారు.
అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి.
ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్లు అరెస్టైనట్లు అధికారులు తెలిపారు. వీరంతా హసన్‌పోరా తవేలాకు చెందినవారిగా భద్రతా బలగాల అధికారులు నిర్ధారించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు