బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జూన్ చివరి వారంలో కూడా అడ్వాణీ ఒకసారి అస్వస్థతకు గురయ్యారు. జూలై మొదటి వారంలో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఆ తరవాత మరోసారి అనారోగ్యGతో అపోలో హాస్పటల్లో రెండు రోజులు చికిత్స తీసుకున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఎల్.కె. అడ్వాణీ బీజేపీలో కురువృద్ధ నేతగా గుర్తింపు పొందారు. పాకిస్థాన్లోని కరాచీలో జన్మించిన అడ్వాణీ, దేశ విభజన తరవాత భారత్ చేరుకున్నారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. రథయాత్ర ద్వారా అడ్వాణీ బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరించారు.ఉప ప్రధానిగా, హోం మంత్రిగా కూడా అడ్వాణీ సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇటీవల అత్యున్నత పురష్కారం భారతరత్న అందించింది.