తిరుమల శ్రీవారి తోమాల సేవా టికెట్ రూ.3 లక్షలకు అమ్ముకున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్సీ భరత్పై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఎమ్మెల్సీ భరత్ పీఏ మల్లిఖార్జున్పై కూడా కేసు నమోదు చేశారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనంతోపాటు, పలు సేవల టికెట్లు అమ్ముకుంటున్నాడని గతంలోనూ భరత్పై అనేక ఫిర్యాదులు వచ్చాయి.