బంగ్లాదేశ్‌లోని భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్‌లో తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. అక్కడ దాదాపు 12 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారి రక్షణకు ఎలాంటి ఢోకా లేదని, అక్కడి సైన్యాధ్యక్షుడితో సంప్రదింపులు జరిపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ అఖిలపక్ష సమావేశంలో వివరించారు. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోవడంలో విదేశాల కుట్ర ఏమైనా ఉందా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాలేమని ఆయన బదులిచ్చారు.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోవడం వెనుక అమెరికా హస్తముందనే ప్రచారం సాగుతోంది. మూడు నెలల కిందట హసీనా నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. బంగ్లాదేశ్ అమెరికా వ్యతిరేక విధానాలు అమలు చేయడం ఇందుకు బలం చేకూర్చుతున్నాయి.
కొద్ది రోజులు హసీనాకు ఆశ్రయం ఇవ్వాలని భారత్ నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.