ఆల్‌ఖైదా పేరుతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించి, కోల్‌కతాలో మహ్మద్ జాహెద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలో పాన్ దుకాణం నడుపుకునే జాహద్ బెదిరింపు మెయిల్ ఎందుకు పంపాడనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెదిరింపు మెయిల్ రాగానే పాట్నా పోలీసులు సీఎం నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు ఎక్కువై పోతున్నాయి. పాట్నా ఎయిర్‌పోర్టుకు కూడా ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేసి ఉత్తుత్తి బెదిరింపులని నిర్థారించారు. మరో ప్రాంతంలో పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.