దేశీయ స్టాక్ సూచీలు కోలుకున్నాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు క్రమంగా బయట పడుతున్నాయి. ఇవాళ ప్రారంభంలోనే సెన్సెక్స్ 915 పాయింట్లు పెరిగి 79675 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 271 పెరిగి 24326 పాయింట్ల వద్ద నడుస్తోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు సోమవారంనాడు ప్రపంచంలో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లను 3 నుంచి 6 శాతం నష్టాలకు గురిచేశాయి. మంగళవారం అన్ని మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఆసియా మార్కెట్ల ప్రభావం దేశీయ స్టాక్ సూచీలపై పడింది. భారీ లాభాలతో మొదలైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో నెస్లే ఇండియా నష్టాల్లో నడుస్తోంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతీ, టీసీఎస్ కంపెనీల్లో లాభాల్లో టేడవుతున్నాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్ 77 డాలర్లను దాటింది. ఇక మారకం విలువ అమెరికా డాలరుతో పోలిస్తే 83.85 వద్ద ట్రేడవుతోంది.