బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. ప్రధాని పదవి నుంచి హసీనా వైదొలిగారు. సైన్యాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ పాలనా బాధ్యతలు చేపట్టారు. అయినా దేశంలో అల్లర్లు చల్లారలేదు. 1971లో పాక్తో జరిగిన యుద్దంలో పోరాడిన వారికి కల్పించిన 30 శాతం రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర అల్లర్లకు దారితీసింది. రెండు వారాలుగా జరిగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 350 దాటింది. వీరిలో 19 మంది పోలీసులు కూడా ఉన్నారు.
ఆందోళనకారులు మాజీ ప్రధాని హసీనా అధికార నివాసం గణభవన్పై దాడి చేశారు. ప్యాలెసలోని వస్తువులు దోచుకున్నారు. కొందరు సోఫాలు ఎత్తుకెళ్లడం వీడియోల్లో వైరల్ అయింది. మరో వ్యక్తి హసీమా ఉపయోగించిన మంచంపై చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. నిరసనకారులు అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని దహనం చేశారు. బంగ్లాదేశ్లో రోడ్లపై ఎక్కడ చూసినా తగలబడుతోన్న వాహనాలే దర్శనం ఇస్తున్నాయి.
ప్రతిపక్షాలతో సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన సైన్యాధిపతి వకార్, 15 గంటల్లో అల్లర్లు అదుపులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేతాయని, అందరూ శాంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఉత్తరప్రదేశ్లోని హిండన్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఆమె లండన్ వెరతారని తెలుస్తోంది. మాజీప్రధాని హసీనాను, దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. ఆమెతో గంటకుపైగా చర్చలు జరిపారు. ఆ విషయాలను అత్యవసరంగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధానికి వివరించారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.