పారిస్ ఒలింపిక్స్ -2024లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు సత్తా చాటింది. మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్ త్రయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్, రొమేనియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.
చివరి గేమ్‌లో మనిక బత్రా అద్భుతంగా ఆడి ప్రత్యర్ధిని ఓడించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్, యూఎస్ఏ, జర్మనీ మధ్య మ్యాచ్‌లో విజేతతో పోటీపడనుంది. మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరారు. ఆ తరువాతి రౌండ్లో ఇద్దరూ ఓడారు.