బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని సైన్యాధిపతి కోరునున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దేశంలో రిజర్వేషన్ల వ్యవహారంలో తలెత్తిన హింసలో ఇప్పటికే 300మందికిపైగా చనిపోయారు. రిజర్వేషన్లు కోరుతున్న ఆందోళనకారులు, అధికార అకాలీదళ్ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తల మధ్య గత నెలలో చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసకు దారితీశాయి. తాజాగా నిరసనకారులు ఢాకాలోని ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ఇప్పటికే ప్రధాని హసీనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వీడియో వైరల్గా మారింది.
బంగ్లాదేశ్లో సైనికల పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా చేయాలంటూ సైన్యాధ్యక్షుడు మరికాసేపట్లో కోరనున్నారని తెలుస్తోంది. సైన్యాధికారి ఢాకాలో కీలక అధికారులతో సమావేశమయ్యారు. హసీనా రాజీనామా చేయగానే సాయంత్రానికి బంగ్లాదేశ్ సైనికపాలనలోకి వెళ్లే అవకాశముంది.
దేశంలో చెలరేగిన హింసను అదపు చేసేందుకు కర్ఫ్యూ విధించినా ఫలితం దక్కలేదు. లక్షలాది మంది ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించారు. ఇప్పటికే మూడు రోజులు దేశంలో సెలవు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దేశంలో అల్లర్లు హద్దుమీరడంతో సైన్యం చేతుల్లోకి పాలన వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు