హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. గడచిన వారం రోజులుగా కురుస్తోన్న అతిభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సిమ్లా జిల్లా సామెజ్ గ్రామ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్ధులు వరదల్లో గల్లంతయ్యారు. వీరిలో నలుగురు క్రీడాకారులు కూడా ఉన్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో 50 మంది పౌరులు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు.
వరదభారిన పడిన కులు, మనాలి, సిమ్లా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సీఎం సుఖ్వీందర్సింగ్ సుఖు పర్యటించారు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. తాజా వరదలతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లింది. జాతీయరహదారులు వరదల్లో కొట్టుకుపోయాయి. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వందలాది పర్యాకులు వరదల్లో చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.