నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంది. వరద నీటితో సాగర్ నిండింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంలో గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. ముందుగా 6 గేట్లు ఎత్తిన అధికారులు సాయంత్రానికి మరికొన్ని గేట్లు ఎత్తేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సాగర్‌కు ( nagarjunasagar project ) 290 టీఎంసీల నీరు చేరడంతో అధికారులు నీటిని పులిచింతలకు విడుదల చేశారు.
రెండేళ్ల తరవాత మొదటిసారిగా నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. 2022 సెప్టెంబరులో ఆఖరిసారిగా సాగర్ గేట్లు ఎత్తారు. గత ఏడాది తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడంతో సాగర్ కింద ఆయకట్టుకు సాగునీరు విడుదల కాలేదు. ఈ ఏడాది ఆగష్టు మొదటి వారంలోనే నాగార్జునసాగర్ జలకళను సంతరించుకోవడంతో తెలుగు రాష్ట్రాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ వరదతో రెండు రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండనుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు