బిహార్లోని హజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్పూర్ హరిహరనాథ్ దేవాలయనికి వెళుతోన్న భక్తులపై హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో 8 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసుల తెలిపారు. ఘటన సమాచారం తెలియగానే పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ట్రక్కులో వెళుతోన్న భక్తులపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.