హమాస్ అగ్రనేతలను మట్టుబెట్టడంతో ఇజ్రాయెల్‌పై లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బోల్లా ప్రతీకారదాడులకు దిగింది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ ప్రాంతంపై రాకెట్లతో విరుచుకుపడింది. అయితే హెజ్బొల్లా ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఐడీఎఫ్ ప్రకటించింది. లెబనాన్ కేంద్రంగా చేసుకున్న హెజ్బొల్లా పాలస్తీనా అనుకూల విధానాలు అవలంబిస్తోంది. ఇరాన్ సహకారంతోనే హెజ్బొల్లా రెచ్చిపోతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పలు వేదికలపై హెచ్చరించారు.
ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హెజ్బొల్లా ఉగ్రవాదులు మరలా దాడులకు ప్రారంభించారు. తాజాగా గల్ఫ్ ఆఫ్ హెడన్ మార్గంలో ప్రయాణిస్తోన్న లైబీరియా వాణిజ్య నౌకపై హెజ్బొల్లా ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో నౌక ధ్వంసమైంది. సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. లెబనాన్‌లో అమెరికా పౌరులు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించింది. బ్రిటన్ కూడా తమ పౌరులు లెబనాన్ నుంచి వెంటనే వెనక్కు వచ్చేయాలని సూచించింది. ఇరాన్ ఏ క్షణంలోనై ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్దమవుతోందని, ఇదే జరిగినే పశ్చిమాసియా మరోసారి భగ్గుమనే ప్రమాద ముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.