బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం దేశంలో తీవ్ర హింసకు దారితీసింది. తాజాగా ఆదివారం చెలరేగిన హింసలో 15 మంది పోలీసులు సహా 106 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఆందోళనకారులు, అధికార పార్టీ మద్దతుదారుల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 300 దాటింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు సహాయనిరాకరణకు పిలుపునిచ్చాయి.
ఆందోళనకు దిగిన వారిని అధికార అవామీలీగ్ పార్టీ విద్యార్థి విభాగం ఛాత్రా లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డుకోవడంతో హింస చెలరేగింది. హింసను ప్రేరేపించేవారు అసలు అవామీలీగ్ విద్యార్థులు కాదని బంగ్లాదేశ్ ప్రధాని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులు దేశ వ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. దేశమంతా కర్ఫ్యూ విధించారు. దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. దీంతో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారాలను మూసేశారు.
గత మూడు వారాలుగా బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం అదుపులోకి వచ్చిన అల్లర్లు శనివారం నుంచి మరలా మొదలయ్యాయి. ఆరుగురు ఆందోళనకారులను అవామీలీగ్ విద్యార్థి సంఘాల కార్యకర్తలు చంపివేశారనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర హింసకు దారితీసింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు