శ్రీవారి దర్శనం విషయంలో పుకార్లు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం మరోమారు విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంది. సదరు వార్తలు పూర్తిగా అవాస్తవమని, భక్తులను తప్పుదోవపట్టించేలా ప్రవర్తిండం సరికాదని హితవు పలికింది.
ప్రతీరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటా విడుదల చేస్తోందని టీటీడీ వివరించింది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది.
తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్సి లైన్ ద్వారా ప్రతీరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వదంతులు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరని పేర్కొంది.