ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET )- 2024 కు 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు ఆగస్టు 3తో ముగిసింది.సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్లు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
షెడ్యూల్ మేరకు అక్టోబర్ 3 నుంచి ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు ప్రారంభమై 20 తేదీతో ముగియనున్నాయి. టెట్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ అక్టోబర్ 4న విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఫైనల్ ఆన్సర్ కీ అక్టోబర్ 27న విడుదల చేసి, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది.