ఎన్డీయే కూటమి 2029లోనూ అధికారంలోకి వస్తుందని, మోదీ ప్రధానిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇండీ కూటమి మరోసారి విపక్షంలో కూర్చోవడం ఖాయమన్నారు. చండీఘడ్ పర్యటనలో భాగంగా మాట్లాడిన అమిత్ షా, విపక్ష పాత్ర పోషించడం ఎలా అనేది ఇండీ కూటమి నేర్చుకోవాలని హితవు పలికారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్ధానాల కంటే బీజేపీకే ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
అస్ధిరతను కోరుకుంటున్న ఈ నేతలే తమ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం అయిదేళ్ళ పదవీ కాలం పూర్తిచేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు .