మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. సాగర్ జిల్లా సాపూర్లో హరౌల్ బాబా గుడి గోడ కూలిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. దేవాలయం పక్కనే ఓ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు గోడ నానిపోయి ఉండటంతో అది కుప్పకూలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరగ్గానే పోలీసులు చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. చనిపోయిన చిన్నారులను గోడ శిథిలాల నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్ రెవా జిల్లాలోనూ శనివారంనాడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం విద్యార్ధులపై గోడ కూలడంతో నలుగురు చనిపోయారు. వరుస ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.