ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన ఇటావా జిల్లాలోని ఉస్రహార్ లో జరిగింది. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం రాత్రి బస్సు, కారు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో 25 మంది గాయపడ్డారు.
నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సు రాయ్‌బరేలీ నుంచి దిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు. రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.