విశాఖ రైల్వే స్టేషన్లో ఆగివున్న రైళ్లో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లో మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే లోగానే బీ6, బీ7, ఎం 1 బోగీలు దగ్ధం అయ్యాయి. మంటలు అంటుకోవడానికి కారణాలు తెలియరాలేదు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది విచారణ చేస్తున్నారు. ఆగివున్న రైలు కావడంతో ప్రయాణీకులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరైనా కావాలని చేశారా? ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో ఫైర్ సిబ్బంది, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల రైలు ప్రమాదాలు పెరగడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడం, రైళ్లలో మంటలు వ్యాపించడంపై కుట్ర కోణాలు ఉన్నాయనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.