ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ మరింత పెరిగింది. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ గుర్తింపు పొందారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. 69 శాతం ఓట్లు సాధించి ప్రధాని మోదీ అగ్రస్థానం సంపాదించారు. మోదీ తరవాత మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ 63 శాతం ఓట్లు సాధించారు. 25 మందితో కూడిన జాబితాలో జపాన్ ప్రధాని పుమియె కిషిద చివరి స్థానంలో నిలిచారు.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి 60 శాతం, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోల్ 52, ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్ 47, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 45, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ 45 శాతం ఓట్లతో తరవాత స్థానాల్లో నిలిచారు.