శ్రావణ మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 5 నుంచి శ్రీశైలం క్షేత్రంలో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి రోజులతో పాటు సోమవారాలు, వారాంతాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చన, ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవలను 16 రోజులపాటు నిలిపివేయనున్నారు. అభిషేకాలను నిలిపివేసిన ఐదురోజుల్లో రోజుకు నాలుగు విడుతలుగా స్పర్శ దర్శనాలు కల్పిస్తారు. రద్దీ సాధారణంగా ఉండే రోజుల్లో యథావిధిగా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు ఉంటాయి.
ఆలయ ద్వారాలు వేకువ జామున 3 గంటలకు తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహించనున్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి 4.30గంటలకు మహామంగళహారతి సేవ ఉంటుంది. ఆ తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. ప్రదోషకాల పూజ తర్వాత దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ఆగస్టు 15 నుంచి 19 వరకు భక్తులకు కేవలం స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు