వన్ హెల్త్ కార్యక్రమం ద్వారానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వికసిత్ భారత్ సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌యాదవ్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిన వన్ హెల్త్ కార్యక్రమాన్ని అత్యవసర కార్యక్రమంగా చేపట్టాలన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు పటిష్టమైన వ్యవస్థను రూపొందించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యావరణం, వన్య ప్రాణులు, పెంపుడు జంతువులను కాపాడుకుంటూ పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని, ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ లక్ష్యసాధనలో ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వర్కర్స్ అసోసియేషన్ తగిన సాంకేతిక సహకారం అందిస్తుందని ఏపిఎస్ఏ సభ్యులు డా.మణికంఠ, డా.మహేంద్రనాధ్, ధనుంజయుడు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు అందించారు. ఏపిఎస్ఏ సహకారంపై సత్యకుమార్ వారిని ప్రశంసించారు.