సోమాలియాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాజధాని మెగదిషూలోని అల్ షబాబ్ బీచ్ హోటల్లో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. 64 మంది గాయపడ్డారు. వారాంతం కావడంతో బీచ్ వద్ద గడిపేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. దాదాపు ఆరుగురు ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో పర్యాటకులపై విచక్షణా రహితంగా విరుచుకుపడ్డారని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.
కాల్పులు జరిపిన తరవాత ఓ ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఘటన విషయం తెలియగానే రక్షణ దళాలు రంగంలోకి దిగి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబందాలున్న అల్ షబాబ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది.