మైనర్ పై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన నిందితుడికి సంబంధించిన బేకరీని ప్రభుత్వం కూల్చివేసింది. అయోధ్యలో అతడికి సంబంధించిన బేకరీని జేసీబీలతో నేలమట్టం చేశారు. స్థలాన్ని కబ్జాచేసి బేకరీ దుకాణం నడుపుతున్నట్లుగా విచారణలో తేలడంతో యూపీ సర్కారు ఆ బేకరీ కూల్చివేతకు ఆదేశించింది.
ఘటనపై స్పందించిన యూపీ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, మొయీద్ ఖాన్ లాంటి నేరగాళ్ల సాయంతో అయోధ్యలో ఎస్పీ గెలిచిందన్నారు. నేరస్తులను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా అఖిలేశ్ యాదవ్ వారిని కాపాడుకుంటున్నదని ఆరోపించారు.నేరగాళ్లకు వ్యతిరేకంగా ఎస్పీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.
మైనర్ పై వికృతచర్యకు పాల్పడిన మొయీద్ ఖాన్ గురించి అసెంబ్లీలో లేవనెత్తానని, నిందితుడికి కచ్చితంగా ఉరిశిక్ష పడుతుందన్నారు. ఘాతుకానికి పాల్పడిన నిందితులపై చర్యలు చేపట్టినందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఘటనను తలుచుకుని కన్నీరు పెట్టారు.