బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రిజర్వేషన్ల వివాదం తో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, యూట్యూబ్‌లను తాత్కాలికంగా నిషేధించింది. ఈ విషయమై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇవ్వకపోయినప్పటికీ పలు ప్రధాన మీడియా సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలైలో హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో 200 మందికి పైగా మరణించారు. కోర్టు తీర్పు తర్వాత నిరసనలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. తాజాగా శుక్రవారం నుంచి మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా పై నిషేధం విధించడంతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని తగ్గంచింది. రాజధాని ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మందికి పైగా నిరసనకారులు గుమిగూడారు.