ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఒక ముస్లిం యువకుడు, హిందువుగా పరిచయం చేసుకుని ఒక హిందూ యువతిని ప్రేమఉచ్చులోకి దింపాడు. ప్రేమ పేరిట ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఆమె అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసాడు. తర్వాత ఆ ఫొటోలు, వీడియోలతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇస్లాంలోకి మతం మారాలనీ, లేదంటే ఆమె అసభ్య దృశ్యాలను వైరల్ చేస్తాననీ బెదిరిస్తున్నాడు. ఆ వ్యవహారంలో కేసు నమోదయింది.
మథుర జిల్లా దీగాతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదయింది. ఆ ప్రాంతానికి చెందిన బాధిత యువతి జులై 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసిఫ్ ఖురేషీ అనే వ్యక్తి తన దుకాణానికి వచ్చేవాడనీ, తన పేరు రాహుల్ అని చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నాడనీ, తనతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడనీ చెప్పింది. ఒకరోజు ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని, ఆ తర్వాత నుంచీ ఏదో వంకతో రోజూ మాట్లాడుతుండేవాడు. ఆ వ్యక్తి కోసి ప్రాంతంలోని నాథూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేవాడు. కొన్నాళ్ళకు ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తన ప్రేమను ఒప్పుకోవాలంటూ ఆమెను బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడిన యువతి మొత్తం మీద అతని వలలో పడింది.
బాధిత యువతి కుటుంబ సభ్యులు ఆమె లవ్ జిహాద్ బాధితురాలని ఒప్పుకున్నారు. నిందితుడు ఆమెను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేవాడని చెప్పారు. మే 2న ఆమెను తన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెను శారీరికంగా కలిసాడు. ఆ సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసాడు. కొన్నిరోజుల తర్వాత అతను హిందువు కాదనీ, ముస్లిం అనీ ఆ యువతికి తెలిసింది. అప్పటినుంచీ ఆసిఫ్ ఖురేషీ బాధిత యువతిని ఇస్లాం తీసుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆమె మతం మారకపోతే ఆమె అసభ్య ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించసాగాడు.
ఆసిఫ్ ఖురేషీ బెదిరింపులు, ఒత్తిళ్ళు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయిన యువతి ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు. అత్యాచారం, హత్య బెదిరింపులు, మతం మారాలన్న ఒత్తిడులు ఆరోపణలపై నిందితుడి మీద కేసు నమోదయింది. పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.