గత కొంతకాలంగా సరిహద్దుల నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడి అరాచకాలకు తెగబడుతున్నారు. గడచిన నాలుగు నెలల్లోనే దాదాపు 36 మంది సైనికులను ఉగ్రవాదులు బలిగొన్నారు. దీంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌పై కేంద్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రత్యేక డీజీ వై.బి.కురానియాపై కూడా కేంద్రం చర్యలు తీసుకుంది.
వీరి పదవీ కాలం ముగియక ముందే కేంద్రం చర్యలు తీసుకుంది. 1989 కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి నితిన్ అగర్వాల్‌పై బదిలీ వేటు పడింది. స్పెషల్ డీజీ జనరల్ నితిన్ అగర్వాల్‌ను కూడా పదవి నుంచి తప్పించారు. ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడంలో వీరు విఫలమైనట్లు కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు వీరిపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.