కృష్ణా వరద కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర నుంచి వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 3.26 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.45 లక్షల క్యూసెక్కుల వరద విడుదల చేశారు. మరోవైపు తుంగభద్ర నుంచి లక్షా 96 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. ఇప్పటికే శ్రీశైలం పూర్తిగా నిండిపోవడంతో వరదను నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం 10 గేట్లు 22 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్‌లో 556 అడుగుల నీరు చేరింది. ఇది 215 టీఎంసీలకు సమానం. ఇంకా 98 టీఎంసీలు వరద వస్తే నాగార్జునసాగర్ (nagarjunasagar project) నిండనుంది. ప్రస్తుత వరద మూడు రోజులు కొనసాగితే సాగర్ పూర్తిగా నిండుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఆగష్టు 6వ తేదీ నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి వరదను పులిచింతలకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా పులిచింతలకు 43 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. కుడి, ఎడమ కాలువలకు నీటిని అందిస్తున్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల