కర్ణాటకలో ఘోరం జరిగింది. మాంసాహారం తిన్న ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక మాన్వి జిల్లా సిరివార తాలూకా కల్లూరు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మాంసాంహారం తీసుకుని పొలానికి వెళ్లిన మల్లేష్, పార్వతి వాంతులు చేసుకున్నారు. వెంటనే వైద్యం కోసం ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి మల్లేష్ తండ్రి భీమణ్ణ, ఈరమ్మ కూడా వాంతులతో బాధపడటం గమనించారు.వెంటనే స్థానికులు వీరిని రాయచూర్ రిమ్స్‌కు తరలించారు.
డాక్టర్లు వైద్యం చేసినా ఫలితం దక్కలేదు. గత రాత్రి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆహారంలో ఏదైనా విష రసాయనాలు కలిశాయా, మాంసం కలుషితం అయిందా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.