శ్రీలంక టూర్ లో భాగంగా ఆ దేశ జట్టుతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్ లో 231 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఒక పరుగు తేడాతో వెనకబడింది. 230 పరుగులు వద్ద ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి హాప్ సెంచరీ చేసి వెనుతిరిగాడు. 47 బంతులు ఆడిన రోహిత్ శర్మ, మూడు సిక్సులు, ఏడు ఫోర్లు బాదాడు. 58 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూగా వెల్లలాగే బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. శుభమన్ గిల్ (16)ను వెల్లలాగే పెవిలియన్ కు పంపాడు. విరాట్ కోహ్లీ(24) వనిందు హసరంగా ఔట్ చేయగా, అకిల ధనంజయ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ , ఎల్బీడబ్ల్యూగా వికెట్ కోల్పోయాడు.
శ్రేయస్ అయ్యర్ (23), కేఎల్ రాహుల్ (31), అక్షర పటేల్(33) తమ వంతు స్కోర్ చేసి ఔట్ అయ్యారు. జట్టు స్కోర్ 211 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి సిరాజ్ వచ్చాడు. 46 వ ఓవర్ ను చరిత అసలంక చాలా కట్టుదిట్టంగా వేశాడు. కానీ సిరాజ్ వికెట్ ను కాపాడుకున్నాడు. 46 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. ఆ తర్వాత 47 వ ఓవర్ లో శివమ్ దూబే భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్ లో భారత్ కు పది పరుగులు వచ్చాయి. శివమ్ దూబే(25 ) జట్టు స్కోర్ సమం చేసిన తర్వాత ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అర్షదీప్ కూడా చరిత అసలంక బౌలింగ్ లో డకౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సిరాజ్(5 ) నాటౌట్ గా మిగిలాడు.
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది.
శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే లోయర్ ఆర్డర్ లో పట్టుదలగా 65 బంతులు ఆడి 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. జనిత్ లియనాగే (20), వనిందు హసరంగ (24), అఖిల ధనంజయ (17) కూడా శ్రమించారు.
ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 56 పరుగులతో రాణించగా మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (1) నిరాశ పరిచాడు. కుశాల్ మెండిస్( 14), సదీర సమర విక్రమ(8), కెప్టెన్ చరిత అసలంక (14) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ , అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్ , శివమ్ దూబే , కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ తీశారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల