రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ళు కౌలు చెల్లిస్తామని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. పదేళ్ళ పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడా గడువు పూర్తి కావడంతో, మరో ఐదేళ్ళు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైతు కూలీలకు పింఛను చెల్లింపు కొనసాగిస్తామన్నారు.
గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. గతంలో భూమి తీసుకున్న సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు రెండేళ్ళు పొడిగిస్తూ సమావేశంలో నిర్ణయించారు.
మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ తీసుకోవాలని నిర్ణయించారు.అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. రాజధాని ప్రాంత పరిధిని కూడా గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన విధంగా పునరుద్ధరిస్తామన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు