ఒలింపిక్స్ 2024లో ఇప్పటికి రెండు కాంస్యపతకాలు గెలిచిన యువ షూటర్ మనూ భాకర్, మూడో పతకం దిశగా సాగుతోంది. షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో రెండోస్థానంలో నిలిచి, ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇవాళ జరిగిన క్వాలిఫికేషన్ ఈవెంట్లో మనూ భాకర్ మరోసారి తన సత్తా చాటింది. మొదటిదైన ప్రెసిషన్ రౌండ్లో 294 పాయింట్లు సాధించింది. తర్వాత ర్యాపిడ్ రౌండ్లో 296 పాయింట్లు సాధించింది. మొత్తం 590 పాయింట్లతో, ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచి, మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించింది.
ఈసారి భారత ఒలింపిక్ జట్టులో మనూభాకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మొదటి కాంస్యపతకం గెలిచింది. దాంతో షూటింగ్ విభాగంలో మొట్టమొదటి ఒలింపిక్ పతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. తర్వాత పురుష షూటర్ సరబ్జోత్సింగ్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్సెడ్ డబుల్స్‌లోనూ గెలిచి రెండో కాంస్యపతకం సాధించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఇప్పుడు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పతకం గెలిస్తే, మూడు మెడల్స్ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర రాస్తుంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి